మలబద్దకం అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేదిస్తున్న సమస్య. మలబద్దకం కడుపు ఉబ్బరానికి, ఆపాన వాయువుల ప్రభావాలకు కూడా కారణమవుతుంది. మలబద్దక సమస్య తగ్గాలంటే ఫాస్ట్ ఫుడ్స్ ను తినడం తగ్గించండి. మాంసం అతిగా తినడం మానుకోండి. నిల్వ ఉంచిన ఆహారాలను తీసుకోకండి. కాఫీ, టీలు అతిగా సేవించకపోవడం మంచిది. మద్యపానం మానుకుంటే మలబద్దక సమస్య చాలా వరకూ ఉండదు. వీలైనంత ఎక్కువగా నీరు తాగండి. పండ్లు తినడం అలవాటు చేసుకోండి.