జానీ బెయిర్‌స్టో (136) సెంచరీతో చెలరేగడంతో.. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ చివరి రోజు మంగళవారం 5 వికెట్ల నష్టానికి ఛేదించింది. ట్రెంట్ బౌల్ట్ (3/94) దెబ్బకు.. ఒక దశలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 93/4తో నిలవడంతో మ్యాచ్ డ్రా చేసుకొనేందుకు ఆతిథ్య జట్టు ప్రయత్నిస్తుందని అంతా భావించారు. కానీ, బెయిర్‌స్టో వీరబాదుడుకు కెప్టెన్ బెన్ స్టోక్స్ (75 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ జత కావడంతో సీన్ మారిపోయింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 121 బంతుల్లో 179 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ ఇద్దరికి జగతగా లీస్ (44) కూడా రాణించాడు.
ట్రెంట్ బౌల్ట్ (3/94) దెబ్బకు.. ఒక దశలో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 93/4తో నిలవడంతో మ్యాచ్ డ్రా చేసుకొనేందుకు ఆతిథ్య జట్టు ప్రయత్నిస్తుందని అంతా భావించారు. కానీ, బెయిర్‌స్టో వీరబాదుడుకు కెప్టెన్ బెన్ స్టోక్స్ (75 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్ జత కావడంతో సీన్ మారిపోయింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 121 బంతుల్లో 179 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఈ ఇద్దరికి జగతగా లీస్ (44) కూడా రాణించాడు. టీ సమయానికి 139/4తో ఉన్న ఇంగ్లండ్ మరో 16 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించిందంటే బెయిర్‌స్టో-స్టోక్స్ ఎంతగా చెలరేగారో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సిక్స్‌లతో హోరెత్తించిన బెయిర్‌స్టో 77 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 224/7తో ఐదోరోజు, మంగళవారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ 284 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ (62) రాణించాడు.