అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో వివిధ రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లలో విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఆందోళనకారులు రైల్వే స్టేషన్లలో దాడులకు పాల్పడుతుండటంతో రైల్వే స్టేషన్లలో పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రైల్వే అధికారులు విశాఖ రైల్వే స్టేషన్ లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దువ్వాడ, కొత్తవలస మీదుగా దారి మళ్లిస్తున్నారు.