జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు జలమయమయ్యాయి. రాత్రి ఒంటిగంట ప్రాంతంలో కురిసిన వర్షానికి డిఎస్పి బంగ్లా, ఆర్ టి సి డిపో, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలు జలమయమయ్యాయి. ఏ కార్యాలయం చూసినా చెరువులను తలపిస్తున్నాయి. 5 సంవత్సరాల క్రితం రోడ్లు వేయడంతో అన్ని కార్యాలయాలు రోడ్డు కన్నా తక్కువ ఎత్తులో ఉండడంతో నీరు బయటకు వెళ్లేందుకు అవకాశం లేదు. ప్రభుత్వ కార్యాలయాలను పట్టించుకునే నాధుడే కరువయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa