చలో గుంటూరు కార్యక్రమం జరుగుతుందనే నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన అధికారులు.. ఆర్మీ నియామక బోర్డు వద్ద భద్రతను పెంచారు. ఆర్మీ కార్యాలయానికి వెళ్లే దారిని మూసివేశారు. రైల్వే స్టేషన్‌కు వచ్చిన అనుమానితులను ప్రశ్నిస్తున్న పోలీసులు.. సీసీ కెమెరాల ద్వారా భద్రతను పర్వ వేక్షిస్తున్నారు. కొత్తపేట స్టేషన్‌కు ఆందోళనకు వస్తున్నారన్న సమాచారంతో పలువురు ఆర్మీ అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేశారు.రైల్వే స్టేషన్‌లో భద్రతను.. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, ఏఎస్పీ అనిల్‌కుమార్ పరిశీలించి.. సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు. ఎవరైనా అభ్యర్థులు శాంతియుతంగా అభిప్రాయాలను చెప్పాలని.. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని.. ఇప్పటికే 200 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు.