పుదీనా ఆకులతో ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం. పుదీనా ఆకులు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఫేస్ వాష్‌లు, మాయిశ్చరైజర్లు వంటి చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో పుదీనాను వాడుతారు. పుదీనా ఆకులలో ఉండే పోషకాలు చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో చక్కగా పనిచేస్తాయి. పుదీనా ఆకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మంలో క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. పుదీనా ఆకులలో ఉండే సాలిసిలిక్ యాసిడ్, విటమిన్ ఏ లు చర్మంలో ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. జిడ్డు చర్మం ఉన్న వ్యక్తులను మొటిమల సమస్య వేధిస్తుంది. పుదీనాలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. మీరు పుదీనా ఆకుల పేస్ట్ ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు ఉంచి ఆరిన తర్వాత కడగాలి. ఈ పేస్ట్ మచ్చలను తగ్గిస్తుంది. చర్మ రంధ్రాలను కూడా శుభ్రపరుస్తుంది. పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మంపై కోతలు, దోమ కాటు, దురద నుంచి ఉపశమనం కలిగిస్తాయి. దీని కోసం మీరు పుదీనా ఆకుల రసాన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. పుదీనా ఆకులు చర్మ రంధ్రాల నుంచి మురికిని తొలగించి చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతాయి. ఇది మీ చర్మంలో రక్త ప్రసరణను పెంచడంలో దోహదపడుతుంది. ఇది కాకుండా చర్మంపై ముడుతలను, గీతలను నివారిస్తుంది. మీరు పుదీనా ఫేస్ ప్యాక్‌ను అప్లై చేసి 20 నుంచి 25 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. పుదీనా ఆకులలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గించడంలో సహాపడుతాయి. దీని కోసం మీరు పుదీనా గుజ్జును కళ్ల కింద రాసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఇది మీ కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది. పుదీనా ఆకులలో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి నల్ల మచ్చలు, దద్దుర్లు తగ్గించడంలో సహాయపడుతాయి. పుదీనా ఆకులను చర్మం ప్రకాశవంతం కావడానికి ఉపయోగిస్తారు.