పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ అధ్యక్షతన పోలీస్ అధికారుల నేర సమీక్ష సమావేశము జరిగింది. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి తీసుకోవలసిన ముందస్తూ జాగ్రత్త చర్యలు గురించి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ శివశంకర్ ఐఏఎస్. అలానే ఆయా పోలీస్ స్టేషన్లలో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న కేసులలో త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సున్నిత గ్రామాలు/ప్రదేశాలలో తప్పకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలి. నాటుసారా తయారీ మరియు అమ్మకం,అక్రమ మద్యం రవాణా వంటి అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపి,ఇటువంటి చర్యలకు పాల్పడే వారికి చట్టపరంగా కఠినంగా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ సూచించారు.