పెన్షన్ వయస్సు పెంచడం ద్వారా తనపై పడే ఆర్థిక భారం చాలా వరకు తగ్గే అవకాశముందని ఏపీ సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పెన్షన్ పొందే వయస్సును వైసీపీ సర్కార్ పెంచిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సర్కార్ పై తగ్గనున్న భారం వివిధ కేటగిరీల కింద ఉన్న వారికి పెన్షన్ సదుపాయాన్ని క్రమంగా తొలగిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆ మేరకు ఆర్దిక భారం తగ్గబోతోంది. ముఖ్యంగా వచ్చే ఆరునెలల్లో ఈ భారాన్ని క్రమంగా తగ్గించుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం తాజా నిబంధనల్ని అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అప్పులతో రాష్ట్రాన్ని నడపాల్సిన పరిస్ధితుల్లో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వానికి ఈ భారం తగ్గితే కాస్తయినా ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. ఈ మొత్తాలతో మిగతా పథకాలను మరింత మెరుగ్గా అమలు చేసేందుకు వీలు కుదురుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa