కనిగిరి నియోజకవర్గం సిఎస్. పురం మండలం అంబవరం కొత్తపల్లి గ్రామంలో ప్రముఖ శైవక్షేత్రమైన భైరవకోనలో ఆదివారం భక్తులు పర్యాటకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో దూర ప్రాంతాల నుంచి కనిగిరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పర్యాటకులు బైరవకోనను సందర్శించి జలపాతంలో స్నానం ఆచరించారు. అనంతరం త్రిముఖ దుర్గా దేవి, కాలభైరవ, నగరేశ్వర, ఆలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం కమిటీ వారు ఏర్పాటు చేశారు.