జాబ్‌లో 'కిక్' లేదని హీరో రవితేజ ఓ సినిమాలో రాజీనామా చేసిన విషయం అందరినీ నవ్వించింది. అయితే ఇది నిజంగానే జరిగింది. ఓ ఉద్యోగి తనకు మజా దొరకలేదని జాబ్‌కు రిజైన్ చేశాడు. ఈ విషయాన్ని హర్ష గోయెంకా ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీనిని సీరియస్‌గానే పరిగణించాలని ఆయన పేర్కొన్నారు. ఈ లెటర్‌పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.