'అగ్నిపథ్'పై వ్యతిరేకతతో సోమవారం భారత్ బంద్ జరుగుతుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. అల్లర్లకు కారణమవుతున్నాయని పేర్కొంటూ 35 వాట్సాప్ గ్రూపులపై నిషేధం విధించింది. 10 మందిని అరెస్టు చేసింది. అయితే ఈ విషయంలో కేంద్రం గోప్యత పాటిస్తోంది. సోషల్ మీడియా సాయంతో అల్లర్లకు కొందరు ప్లాన్ చేస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.