అగ్నిపథ్ నిరసన కాస్త బీజేపీ నేతల మెడకు చుట్టుకొంటోంది. ఈ నేపథ్యంలో పలువురు బీజేపీ నేతలకు భారీ భద్రతా కల్పించారు. అగ్నిపథ్‌పై నిరసనల జ్వాల కొనసాగుతోంది. ఉత్తరాధిలో ప్రారంభమైన నిరసనలు.. దక్షిణాదికి పాకాయి. ఉత్తరప్రదేశ్, బీహర్‌లో ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. బీహర్‌లో నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేతలకు భద్రతను కల్పించింది. వారిలో ఇద్దరు ఎంపీలు, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు.. ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. వీరందరికీ వై క్యాటగిరీ భద్రతను కల్పించింది.
బీహర్‌లో పరిస్థితి దిగజారింది. రైళ్లకు మంటలు పెట్డం, స్టేషన్స్‌లో బీభత్సం, బీజేపీ నేతలపై దాడి, ఆఫసులు, ఇళ్లు, కార్లును దగ్దం చేస్తున్నారు. బీజేపీ నేతలకు, రాష్ట్ర అధ్యక్షులకు భద్రతను కల్పించారు. బీహర్‌లో గత 3 రోజుల నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. వాటిని అణచివేయడంలో నితీశ్ కుమార్ ప్రభుత్వం విఫలమైంది. దీంతో భద్రతను కల్పించాలని ప్రధాని మోడీ భావించారు. అందుకే సెక్యూరిటీ కల్పించారు. పార్టీ కార్యాలయాలు దహనం, ఆందోళనకారులు రెచ్చిపోవడంతో.. పోలీసులు ఏమీ చేయలేకపోయారు. దీంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్ర ప్రభుత్వం తలొగ్గి కొన్ని సవరణలు చేపట్టింది. ఆందోళన చేపట్టిన వారిని శాంతింపజేసే ప్రయత్నాలు చేసింది. రక్షణశాఖలో గల అగ్నివీర్స్‌కు 10 శాతం కోస్ట్ గార్డ్, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే డిఫెన్స్ సంస్థల్లో అవకాశం ఉంటుంది. హోంశాఖ పరిధిలో గల అగ్నివీర్స్‌కు 10 శాతం ఖాళీలను సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోలీస్, సీఏపీఎఫ్, అసోం రైఫిల్స్ విభాగంలో ఛాన్స్ ఉంటుంది.సీఏపీఎప్, అసోం రైఫిల్స్ గల అగ్నివీర్స్‌కు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.నేవీ నుంచి అగ్నివీర్లకు మర్చంట్ నేవీలో ఉపాధి, షిప్పింగ్ మంత్రిత్వశాఖ ద్వారా సిక్స్ సర్వీస్ అవెన్యూ ఉంటుంది. అగ్నిపథ్ స్కీంలో భాగంగా వయస్సు 21 నుంచి 23 ఏళ్లకు పెంచారు. కరోనా వల్ల ఈ సడలింపును ఇచ్చారు. పోలీస్ రిక్రూట్ మెంట్‌లో అగ్నివీర్లకు ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. పదో తరగతి పాసయిన అగ్నివీర్లకు నేషనల్ ఇనిస్టి్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ కోర్పు ప్రారంభిస్తారు. వారికి 12వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్ అందిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa