ఏపిఎస్ఆర్టిసి చైర్మన్ ఎ.మల్లికార్జున రెడ్డి, వైస్ చైర్మన్, డైరెక్టర్ మెట్టపల్లి చిన్నప్పరెడ్డి విజయానంద రెడ్డిలకు క్యాబినెట్ హోదాను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడివిడిగా ఉత్తర్వులను సోమవారం జారీ చేసింది. సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ ఈ ఏడాది మే 17 న జారీ చేసిన G.O. ఎంఎస్.నెం.36 లో పేర్కొన్న విధంగా ”ఎస్” కేటగిరీ క్రింద ఈ క్యాబినెట్ హోదాను ఖరారు చేయడం జరిగిందని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.కాగా ఈ మధ్య కాలంలోనే జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్టీసీ ని ప్రభుత్వంలోకి విలీనం చేస్తాను అని చెప్పి, విలీనం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.