పల్నాడు జిల్లా, వినుకొండ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంబ్లింగ్ స్థావరంపై ఆకస్మిక తనికీలు జరిపి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని 15380/- రూపాయలు సీజ్ చేశారు. అలానే రసరావు పేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అల్లూరివారి పాలెం గ్రామంలో గ్యాంబ్లింగ్ స్థావరంపై ఆకస్మికతనిఖీ జరిపి 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని 10,300/- రూపాయలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ వారు మాట్లాడుతూ... జిల్లాలో ఎక్కడ అవాంఛనీయమైన కార్యకలాపాలు జరుగుతన్న పసి గట్టి వాటిని నిరోధించడానికి ప్రయత్నం చేస్తాము అని ప్రజలకి హామీ ఇచ్చారు. ప్రజలు కూడా చేదు మార్గాలు మానుకొని మంచి జీవన శైలిని కలిగి ఉండాలని హితవు పలికారు.