తెలుగువాడైన సీనియర్ రాజకీయ నాయకుడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంగళవారం హైదరాబాద్లో గుండెపోటుకు గురయ్యారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. దగ్గుబాటికి చికిత్స అందించిన వైద్యులు... అతడి గుండెకు స్టెంట్ అమర్చారు. దీంతో ప్రాణాపాయం నుంచి అయన బయటపడ్డారు.