ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాటి వివాదం...నేడు పరిష్కారమైంది....ఆలస్యంగా జీవితాల్లో వెలుగునిస్తోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 21, 2022, 11:45 PM

విధి రాత అందరికీ ఒకేలా ఉండదు. కానీ ఓ సంవత్సరంలో విధి రాత కొంత మందికి  ఇకేలా రాసేసింది. అందరికీ ఉద్యోగాలు ఆలస్యంగా వచ్చేలా పైవాడు విధిరాత రాసేశాడు. 55 ఏళ్ల కూలీకి ప్రభుత్వ టీచర్ ఉద్యోగం వచ్చింది. ఇదేమిటీ అని ఆశ్చర్యపోతున్నారా.. మీరు చూస్తున్నది నిజమే. 30 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఉద్యోగం వచ్చింది. కోర్టు కేసులతో బ్రేకులు పడినా.. ఇప్పుడు న్యాయం జరిగింది. కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహళ్లికి చెందిన బి.నాగరాజును తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ కష్టపడి అతడ్ని చదివించారు. ఆయన 1990లో బీఈడీ పూర్తి చేసి.. 1994, 1997 డీఎస్సీల్లో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు.. కానీ ఉద్యోగం మాత్రం రాలేదు.


ఆ తర్వాత 1998 డీఎస్సీలో మంచి ర్యాంకు సాధించారు. కానీ దురదృష్టం కొద్ది ఈ డీఎస్సీ ప్రక్రియపై వివాదం జరిగింది. ఈ వ్యవహారం కోర్టు వరకు చేరింది. ఏళ్లు గడిచిపోయాయి.. వివాహమైన తర్వాత నాగరాజు తన భార్య స్వగ్రామం కర్నూలు మండలం గార్కేయపురానికి వెళ్లారు. ఆయన అక్కడే కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇప్పుడు నాగరాజు వయసు 55 ఏళ్లు కాగా.. కోర్టు వివాదాలు వీడటంతో 1998 డీఎస్సీలో ఎంపికైన వారి నియామకాల ఫైల్‌‌కు క్లియరెన్స్ రావడంతో ఎంపికైన వారి జాబితాలో నాగరాజు పేరు ఉంది. దీంతో ఆయన ఆనందానికి అవధులు లేవు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com