పలు దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్, మలేషియాల్లో ఈ భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. పాక్, అఫ్గాన్లలో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.1గా నమోదు కాగా మలేషియాలో 5.61గా భూకంప తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంప ఘటనల్లో ఏ ప్రాణనష్టం సంభవించలేదు.