108 ఉద్యోగుల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత 20 రోజులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న 108 ఉద్యోగులు, ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో నేడు తుది దశగా చలో విజయవాడ కార్యక్రమాన్నిటెక్కలిలో సోమవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి 500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. 108 నాయకులు మా డిమాండ్లు నెరవేరని యెడల 108 వాహనాలను నిలుపుదల చేసి సమ్మెలోకి వెళ్తామన్నారు.