ఆర్టీసీలో పనిచేస్తున్న ఔట్సోర్సింగు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం నూతన బాధ్యతలు స్వీకరించిన ఆర్టీసీ జోనల్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణకి విజయనగరం కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈసందర్భంగాఆర్టీసీ అవుట్సోర్సింగ్ అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ సెక్రెటరీ ఏ అశోక్ మాట్లాడుతూ.. థర్డ్ పార్టీ విధానం వల్ల చాలా నష్టపోతున్నామని, ఆర్టీసీలో థర్డ్‌పార్టీ విధానాన్ని రద్దు చేయలన్నారు.