భారత్, పాక్ మధ్య పచ్చగడ్డివేసినా భగ్గుమనే పరిస్థితి. కానీ రెండు దేశాల మధ్య ప్రజల మధ్య అలాంటి బేధాభావం మాత్రం కనిపించడంలేదు. ప్రేమకు కులాలు, మతాలు అడ్డురావు.. ఇక ఎల్లలు అసలే ఉండవు. వేర్వేరు దేశాలకు చెందిన వాళ్లు ఒక్కటైన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా దాయాది దేశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మధ్య ప్రేమ చిగురించింది. వారి ప్రేమకు ఏ హద్దులు, సరిహద్దులు ఆటంకం కాలేదు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ అబ్బాయి.. పాకిస్థాన్‌లోని అమ్మాయిని ప్రేమించాడు. వారి ప్రేమకు ఫేస్‌బుక్ వారిధిగా మారింది.
యూపీకి చెందిన ఫరుక్కాబాద్‌కు చెందిన జర్దోజీ ఆర్టిస్ట్ మహ్మద్ జమల్‌కు (23) ఎరాం అనే అమ్మాయితో ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. ఇద్దరు మాట్లాడుకోవడం తర్వాత ఆమెది పాకిస్థాన్ తెలిసింది. అయినా సరే వారిద్దరూ ఏ మాత్రం వారి ప్రేమను చంపుకోలేదు. జర్దోజీ ప్రపోజ్ చేయగానే.. ఎరాం ఒప్పుకుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని నిర్ణయానికి వచ్చారు. దానికోసం జర్దోజీ ఆర్టిస్ట్ భారత దేశం నుంచి పాకిస్థాన్‌నుకు వెళ్లాడు. జూన్ 17వ తేదీన ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. త్వరలోనే ఆ జంట ఇండియాకు రానున్నారు.
ఆ జంటకు స్వాగతం చెప్పేందుకు జర్దోజీ తండ్రి అలీముద్దిన్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా జర్దోజీ, ఎరాం జంట కోసం ఎదురుచూస్తున్నామని, ఉత్తరప్రదేశ్‌లో తమ సంప్రదాయాల ప్రకారం మళ్లీ ఘనంగా పెళ్లి చేస్తామని చెప్పాడు. "అమ్మాయికి మొదటి ఏడాది తాత్కాలిక వీసా లభిస్తుందని, దానిని మూడేళ్ల వరకు పొడిగించవచ్చని అధికారులు తెలిపారు. ఈ సమయంలో ఆమె ప్రత్యేక వివాహ చట్టం కింద శాశ్వత జాతీయత కోసం దరఖాస్తు చేసుకోవచ్చు." జర్దోజీ జమాల్ తండ్రి చెప్పారు. మరోవైపు ఈ జంట వివాహానికి ఫరుక్కాబాద్ జిల్లా యంత్రాంగం కూడా సహకరిస్తామని తెలిపినట్టు అలీముద్దీన్ వెల్లడించాడు.