రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ హబ్ గ మారుస్తున్నాము అని సీఎం జగన్ తెలియజేస్తున్నారు. ఈ తరుణంలోనే వివిధ దేశాల నుండి పలు రకాల కంపెనీలు వచ్చినట్లు తెలియజేసారు. వచ్చిన కంపెనీలన్నిటిని కలిపి ఒక పోస్టర్ తయారు చేసి విడుదల చేసారు. ఈ విషయంపై స్పందించిన మాజీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.... జగన్ రెడ్డి ది సిగ్గు లేని జన్మ ఈ పోస్టర్ లో ఉన్న ఏ ఒక్క కంపెనీ సీఎం జగన్ తెచ్చింది కాదు. ఏపీని ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు నాటి సీఎం చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఫలితంగా ఎలక్ట్రానిక్ కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. ఎవరికో పుట్టిన బిడ్డకి తానే తండ్రి అని చెప్పుకోవడం వ్యసనంగా మారిన జగన్ రెడ్డి మరోసారి ఆ ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు అని ఆరోపించారు.