తండ్రికి తెలీయకుండా ఓ కొడుకు తన తండ్రి ఫోన్లో గేమ్ ఆడి రూ.39 లక్షలు పోగొట్టిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. తాజ్నాగ్రికు చెందిన ఓ విశ్రాంత సైనికుడి కొడుకు తన తండ్రి మొబైల్‌ను వినియోగిస్తుండేవాడు. తాజాగా ఆ బాలుడు తన తండ్రి మొబైల్లో 'బ్యాటిల్ గ్రౌండ్' అనే ఆన్లైన్ పెయిడ్ గేమ్‌ను ఇన్స్టాల్ చేసి ఆడాడు. డబ్బులు చెల్లించే ఆప్షన్‌ను ఆటోమోడ్లో పెట్టి గేమ్ ఆడాడు. ఇంతలో తండ్రి ఖాతా నుంచి రూ.39 లక్షలు ఖాళీ అయ్యాయి. తండ్రి ఫిర్యాదు మేరకు ఆగ్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.