శుక్రవారం జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం మరోసారి వాయిదా పడింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ రేపు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. జగన్ విదేశీ పర్యటన తర్వాత కేబినెట్ భేటీ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 22న జరగాల్సిన కేబినెట్ సమావేశం 24వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కేబినెట్ సమావేశం వాయిదా పడింది.