ఎన్నికల మేనిఫెస్టోలో 95 శాతం హామీలు అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దేనని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. అమ్మ ఒడిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ ప్లీనరీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. అలాగే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కులాలు, మతాలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఐతే హామీలను నెరవేర్చేసాం అని డప్పు కొట్టుకుంటున్న వైసీపీ , మునుపటి పధకాలను గాలిలో కలిపింది అని వాపోతున్నారు. ముస్లింలకు సంభందించిన దుల్హన్ పధకం, ఎస్సీ ల కార్పొరేషన్, ఎస్సీ సబ్ ప్లాన్ లాంటివి ఎక్కడికి పోయాయి అని ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది.