సీఎం జగన్ ఆదేశాలు, ఆశయాలు మేరకు రాష్ట్రంలో ఏ ఒక్కరూ నిరుద్యోగిగా ఉండకూడదని, వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే దృక్పధంతో ప్రయివేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే దిశగా ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. జాబ్ మేళా అనేది నిరంతర ప్రక్రియ. అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని విజయ్ సాయి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో ఎవరూ నిరక్షరాస్యులుగా ఉండకూడదనేది ముఖ్యమంత్రి అభిమతం, ఆశయం. ప్రతి ఒక్కరూ ఉన్నత చదువుకోవాలి, ముఖ్యంగా విద్యార్థినులు కూడా గొప్పగా చదువుకుని ఉన్నత పదవులకు వెళ్లాలి. మహిళా సాధికారత వైయస్ఆర్ సీపీ ఆశయం, ముఖ్యమంత్రి కల. అది తప్పకుండా నెరవేరుతోంది. అందుకే నాడు-నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ఆహ్లాదకర వాతావరణం ఉండేవిధంగా తీర్చిదిద్ది విద్యా ప్రమాణాలు పెంచుకోవడం జరుగుతోంది. విద్యతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి. టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రపంచం అంతా ఒకటే. ఎక్కడకు వెళ్లాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ చూస్తారు. మనసులో ఉన్న ఆలోచనలను ఎదుట వ్యక్తికి ఎంత ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేస్తామో.. దాన్నిబట్టే ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశాలు ఉంటాయి అని తెలియజేసారు.