ఏపీలోని నందమూరుకు చెందిన యంగల శ్రీదేదీప్య (22) ఎమ్మెస్సీ న్యూట్రీషియన్ చదివింది. ఆమెకు ఇటీవలే ఓ ఆస్పత్రిలో జాబ్ వచ్చింది. అయితే తనకు జాబ్ చేయడం ఇష్టం లేదని, పీజీ చేస్తానని శ్రీదేదీప్య తన తండ్రికి చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నందున జాబ్ చేయాలని తండ్రి సూచించాడు. ఈ నేపథ్యంలో శనివారం శ్రీదేదీప్య సూసైడ్ చేసుకుంది. ఆమె చీమల మందు తాగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.