శ్రీలంక దేశంలో ప్రజలు అల్లాడుతున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభం వల్ల ఆ దేశ సర్కార్ నిత్యావసరాల రేట్లను భారీగా పెంచేసింది. తగిన ఇంధనం లేకపోవడం వల్ల ప్రభుత్వ కార్యాలయాలను కూడా కొన్నింటిని నిర్వహించడం లేదు. తాజాగా ఆ దేశంలో లీటర్ పెట్రోల్‌పై రూ.50, డీజిల్ పై రూ.60లను పెంచింది. దీంతో శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధరను చూస్తే రూ.470కు చేరగా డీజిల్ ధర రూ.460కు చేరింది.