ఏపీలోని నంద్యాల జిల్లా బోయరేవుల గ్రామంలో శుక్రవారం నవ వరుడు శివకుమార్(26) మృతి చెందాడు. అతడు రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు మొదట భావించారు. అయితే బోయరేవుల బ్రిడ్జి వద్ద ఎవరో అతడిని కొట్టి చంపారని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని అనుమానిస్తున్నారు. బ్రిడ్జికి సమీపంలో రక్తపు మరకలు, మృతుని చెప్పులను గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.