సత్తెనపల్లిలోని తహశీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సత్తనపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు దివ్వెల శ్రీనివాసరావు ఈ తహశీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. దివ్వెల మాట్లాడుతూ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం దృష్టి సారించి.. సమస్యలు పరిష్కరించాలని కోరారు.