నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణానంతరం ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధించారు. దీనిపై సీఎం జగన్ స్పందించారు.విక్రమ్ ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్ కు నివాళిగా ఆత్మకూరులో 83 వేల మెజారిటీతో విక్రమ్ ను గెలిపించారని వివరించారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.