శ్రీలంక దేశంలో అమెరికా అధికార బృందం పర్యటిస్తోంది. ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు సాయం చేయాలన్న విజ్ఞప్తి మేరకు అమెరికా ఆర్థిక, విదేశాంగ శాఖల అధికారులు శ్రీలంకలో పర్యటిస్తున్నారు. ‘‘శ్రీలంక చరిత్రలోనే దారుణమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ దేశానికి ఏమేం అవసరమో, ఎలాంటి సాయం చేస్తే బాగుంటుందనే అంశాలను అమెరికా బృందం పరిశీలిస్తోంది. ఆర్థిక వృద్ధికి, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడానికి తగిన సాయం అందించడంపై దృష్టి పెడుతున్నాం” అని శ్రీలంక రాజధాని కొలంబోలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇటు అమెరికా బృందం పర్యటిస్తున్న సమయంలోనే అటు శ్రీలంక ప్రభుత్వం భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం గమనార్హం.