ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. అమ్మ ఒడి నిధులను శ్రీకాకుళంలో జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఒక్క కంప్యూటర్ బటన్ క్లిక్ తో అమ్మ ఒడి లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి బయల్దేరతారు. ఉదయం 10.30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు. 11 గంటలకు శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. జగనన్న అమ్మ ఒడి పథకం లబ్దిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం సీఎం ప్రసంగం ఉంటుంది. మధ్యాహ్నం 12.15 గంటలకు శ్రీకాకుళం నుంచి తిరుగు పయనమవుతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.