ఏ పార్టీ పొత్తు లేకపోయినా 160 సీట్లు గెలిచే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఆదివారం మాట్లాడారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతగాని పనులు, చెత్త పరిపాలనకు ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందన్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి చేయకుండా అమ్ముకునే అధికారం సీఎం జగన్ కి ఎవరిచ్చారన్నారు. చంద్రబాబు పాలన కోసం ప్రజలు చూస్తున్నారన్నారు.