గుంటూరు జిల్లాలో గడచిన 24 గంటల్లో పది మంది కోవిడ్- 19 బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 6, పెదకాకాని మండలంలో 2, మంగళగిరి రూరల్, తాడేపల్లి రూరల్, ప్రాంతాల్లో ఒక్కొక్క కేసు నమోదు అయ్యాయి. తప్పనిసరి మాస్కులు ధరించాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని వైద్య శాఖ అధికారులు తెలిపారు.