ఉల్లిపాయ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. రక్తహీనతను, శరీరంలోని కొవ్వును తగ్గించేందుకు సహాయపడుతుంది. ఉల్లిలో ఉండే రిడక్టేజ్ అనే ఎంజైము కొవ్వు ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. గుండెకు సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుంది.శరీరంలో నైట్రిక్ యాసిడ్ విడుదల చేసి అధిక రక్తపోటుకు చెక్ పెడుతుంది. దంతాలపై క్రిములను నాశనం చేస్తుంది. ఎముకలను బలంగా చేస్తుంది. జుట్టు పెరుగుదలకు ఉల్లి మేలు చేస్తుంది.