ఆన్లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందేలపై జీఎస్టీ పెంచనున్నారు. ఈ మేరకు చండీగఢ్‌లో ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. మేఘాలయ సీఎం సంగ్మా నేతృత్వంలోని మంత్రుల బృందం గేమ్‌లో ఆటగాడు చెల్లించే ప్రవేశ రుసుం సహా పూర్తి విలువతో పన్ను విధించాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం వీటిపై 18 శాతం జీఎస్టీ విధిస్తుండగా.. దానిని 28 శాతానికి పెంచనున్నారు.