రాష్ట్రపతి ఎన్నికలు దేశమంతా హాట్‌టాపిక్‌గా నడుస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ తమ అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ప్రకటించింది.అదే విధంగా ప్రతిపక్షాలు తమ అభ్యర్థిగా సీనియర్ నేత యశ్వంత్ సిన్హాను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా సోమవారం యశ్వంత్ సిన్హా తన నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ సమక్షంలో సిన్హా తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ప్రక్రియలో ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, జమ్మూ-కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూద్ అబ్దుల్లా, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మంత్రి కేటీఆర్ తదితర ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు జులై 18న జరగనున్నాయి.