శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ కు సోమవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. భూ కుంభకోణం కేసులో మంగళవారం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఉద్ధవ్ క్యాంపులో సంజయ్ రౌత్ కీలక నేతగా ఉన్నారు. ముంబైలోని ఈడీ ఆఫీస్ లో ఈడీ అధికారులు రేపు సంజయ్ రౌత్ ను విచారించనున్నారు. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేల వెనుక బీజేపీ ఉన్నట్లు శివసేన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు రావడం చర్చనీయాంశంగా మారింది.