ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా ఆటగాళ్లపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా పాజిటివ్‌గా తేలటంతో స్వయంకృతమేనని బీసీసీఐ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ చేరుకున్న రోహిత్, విరాట్ కోహ్లీ ఇతర ఆటగాళ్లు బీసీసీఐ, జట్టు వైద్య బృందం సలహాలు పట్టించుకోకుండా మాస్కులు ధరించకుండా తిరిగారని, ఫలితంగా రోహిత్‌కు పాజిటివ్‌గా వచ్చిందని బోర్డు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.