మహారాష్ట్ర రాజకీయ సమరం హాట్ హాట్‌గా సాగుతోంది. శివసేన నేతలు అజయ్ చౌదరి, సునీల్ ప్రభులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.ఈ పిటిషన్‌ను జులై 11న విచారణకు సుప్రీంకోర్టు వాయిదా చేసింది. ఏక్నాథ్ షిండేతో పాటు మరో 15 మంది తిరుగుబాటు శాసనసభ్యులపై డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ జారీ చేసిన అనర్హత నోటీసుకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై డిప్యూటీ స్పీకర్, మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభ కార్యదర్శి, కేంద్రం, ఇతరులకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లో అన్ని పక్షాలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. షిండే వర్గానికి చెందిన రెండు పిటిషన్లపై విచారణకు సుప్రీం అంగీకరించింది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ ప్రారంభించిన ఎస్సీ, హైకోర్టుకు ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు.
డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు ఇవ్వడంపై ఏక్‌నాథ్ షిండే వర్గం నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.. డిప్యూటీ స్పీకర్ జిర్వాల్ నిర్ణయాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అటు తమదే అసలైన శివసేన అంటున్నారు ఏక్‌నాథ్ షిండే. శాసనసభా పక్షంలో మూడింట రెండొంతుల మెజారిటీ తమకే ఉండగా లెజిల్లేటివ్ పార్టీ నేతగా మరొకరికి ఎలా అవకాశం ఇస్తారని డిప్యూటీ స్పీకర్‌ని ప్రశ్నిస్తూ పిటిషన్ దాఖలు చేసింది షిండే టీమ్.