నర్సాపురం మండలం బియ్యపుతిప్ప, వేములదీవి (ఈస్ట్) గ్రామాలలో బాదుడే బాదుడు కార్యక్రమం నరసాపురం మండల అధ్యక్షులు వాతాడి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. రెండు గ్రామల ప్రజలకు బాదుడే బాదుడు కరపత్రాలను పంచుతూ అధికార వైసీపీ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న దురాగతాలను, అధికార దుర్వినియోగాన్ని, కక్ష సాధింపు చర్యలను, జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై అవగాహన లేమిని తెలియజేసామని టీడీపీ ఇంచార్జి పోతూరి రామరాజు తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిత్యావసర సరుకులపై ధరల పెరుగుదలను ప్రజలకు తెలియజేస్తూ స్థానిక నాయకులతో అలాగే నరసాపురం పట్టణ, మండల నాయకులతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని తెలియజేసారు.