ఒక మనిషి తలరాతను మార్చగలిగే శక్తి ఒక చదువుకు మాత్రమే ఉంది. ఒక కుటుంబం తలరాత మార్చేది చదువే అని సీఎం జగన్ అమ్మవడి కార్యక్రమంలో తెలియజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... సమాజం, దేశం తలరాతను మార్చే శక్తి చదువుకే ఉంది. చదువులు బాగా ఉన్న దేశాల్లో ఆదాయం కూడా ఎక్కువే. అక్కడి ప్రజలు మనకన్నా ఎక్కువ ఆదాయం ఉంది. మనకంటే వారి తలసరి ఆదాయం ఎక్కువగా ఉండటానికి చదువే కారణం. అందుకే తేడా కనిపిస్తుంది. చదువే నిజమైన ఆస్తి. ఏ ప్రభుత్వమైనా చదువుపై పెట్టే ఖర్చు వృథా కాదు. ప్రతిపైసా కూడా పవిత్రమైన పెట్టుబడి. విమర్శించే వారికి కూడా ఇదే చెబుతున్నాను. ఒక తరాన్ని, వాళ్ల తలరాతలను మార్చే శక్తి చదువులకు ఉంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి బతకగలిగే శక్తి చదువుతోనే వస్తుంది. అలాంటి నాణ్యమైన చదువులు మన రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకు అందాలని, దక్కాలని తపన, తాపత్రయంతో గత మూడేళ్లుగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాను. దేశంలో అన్ని రాష్ట్రాలకు మిన్నగా ప్రతి ఒక్కరికి మంచి చదువులు అన్నది ఒక్క హక్కుగా, బాధ్యతగా అందేలా మన ప్రభుత్వం నిండు మనసుతో అడుగులు ముందుకు వేస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు శ్రీకారం చుడుతున్న జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం అని తెలియజేసారు.