అమెరికన్లు ఎప్పటినుంచో కోరుకుంటున్న తుపాకుల నియంత్రణ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. తుపాకీ నియంత్రణ చట్టంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారం సంతకం చేశారు. ఇటీవల టెక్సాస్ లోని పాఠశాలలో ఇద్దరు టీచర్లతో సహా 19 మంది విద్యార్థుల ఊచకోతతో పాటు సాముహిక కాల్పులు పెరుగుతున్నాయని ఈ చట్టం చేశారు. ఇది ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని బైడెన్ అన్నారు. ఈ బిల్లుకు తొలుత సెనెట్, తర్వాత వైట్ హౌస్ ఆమోదం తెలిపింది.