ఈ సంవత్సరం చార్ధామ్ యాత్రలో ఇప్పటి వరకు రెండువందల మందికిపైగా యాత్రికులు మరణించారు. యాత్ర ప్రారంభమై రెండు నెలలు కూడా గడువకముందే 203 మంది యాత్రికులు మరణించారని ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రకటించింది. కేదార్నాథ్ యాత్ర మార్గంలో 97 మంది, బద్రీనాథ్ ధామ్ మార్గంలో 51 మంది, గంగోత్రి మార్గంలో 13 మంది, యమునోత్రి మార్గంలో 42 మంది చనిపోయినట్లు వివరించారు. చాలా వరకు ఆరోగ్య సమస్యలే కారణం.