రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం రైతుల దగ్గర కొన్న ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో అలంపురం గ్రామంలో రైతు పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులకు మేలు చేసే ప్రభుత్వం మాదే అని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ, నిజానికి రైతులని గాల్లోకి వదిలేసింది అని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే సొమ్ముని రాష్ట్రము ఇస్తున్నట్లు చూపించి రైతు భరోసా పేరుతో రైతులని మోసం చేస్తున్నారు అని ఆరోపించారు. రైతులకి రాబోయే రోజుల్లో గిట్టుబాటు ధరలు కల్పించి , పంటను ప్రభుత్వం కొనుగోలు చెయ్యవలసిన బాధ్యత ఉందని తెలియజేసారు. ప్రస్తుతం వారికి రావలసిన బకాయిలు చెల్లిచకపోతే రైతుల తరపున రోడ్ మీదకు రావడానికైనా సిద్దమే అని హెచ్చరించారు.