అమెరికాలోని టెక్సాస్‌లో విషాదకర ఘటన వెలుగుచూసింది. శాన్ ఆంటోనియో వద్ద ఓ ట్రక్కులో 42 మృతదేహాలు బయటపడ్డాయి. మరో 16 మంది ప్రాణాలతో ఉండగా వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
ట్రక్కులో ఉన్నవారు మెక్సికో నుంచి అక్రమంగా అమెరికా సరిహద్దులు దాటినట్లు భావిస్తున్నారు. అయితే, ట్రక్కులో 42 మంది ఎలా మరణించారనేది తెలియలేదు. శాన్ ఆంటోనియో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసును దర్యాప్తు చేపట్టారు.