కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలాసీతారామన్ అధ్యక్షతన చండీగఢ్‌లో మంగళవారం నుంచి జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 2 రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
పలు వస్తువుల పన్ను రేట్లలో మార్పులు, రాష్ట్రాలకు పరిహారంతో పాటు రిజిస్ట్రేషన్ నిబంధనల్లో సడలింపులు, తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.