ఇటీవల అనేక జిల్లాలలో ద్విచక్ర వాహనాల చోరీలు జరుగుతూ ఉండడంతో మన రాష్ట్ర DGP కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి మరియు ఏలూరు రేంజ్ DIG జి. పాల రాజు సూచనల ప్రకారం కాకినాడ జిల్లా SP M. రవీంద్రనాథ్ బాబు పర్యవేక్షణలో జిల్లాలోని అధికారులను చైతన్యపరచి దీనిపై ప్రత్యేక నిఘా పెట్టి కేసులు శోధించే విషయంలో సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పోలీసు అధికారులు అందరూ ప్రత్యేక పార్టీలతో అనేక రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ క్రమంలో కాకినాడ జిల్లా Addl. SP అడ్మిన్రీ. పి. శ్రీనివాస్ గారు, పెద్దాపురం సబ్-డివిజినల్ పోలీస్ ఆఫీసర్ శ్రీబి. అప్పారావు గారు, SB DSP శ్రీ M. అంబికా ప్రసాద్ గారు,జగంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ బి. సూర్య అప్పారావు గారు, జగ్గంపేట సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ టి.రఘునాధ రావు గారు వారి సిబ్బంది ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపర్చి తగిన కృషి చేయడం జరిగింది. వారి సమిష్టి కృషి ఫలించి గత కొంతకాలంగా మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తూ పట్టుబడకుండా తిరుగుతున్న ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చెయ్యడం జరిగింది.
అరెస్ట్ కాబడిన వారి పేర్లు: 1. నడిగట్ల కృష్ణ ,A/25, ఏలేశ్వరం village మరియు మండలం, R/O జగ్గంపేట విలేజ్ & మండలం, 2. మంగిన వీర వెంకట సత్యనారాయణ @వీరబాబు, A/38, గోవిందపురం విలేజ్,జగ్గంపేట మండలం.వీరి వద్ద నుండి మొత్తం 100 ద్విచక్రవాహనాలును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇద్దరు నిందితులలో ప్రధాన నేరస్తుడు నడిగట్ల కృష్ణ సొంత గ్రామం ఏలేశ్వరం లో గతంలో తాపీ పని చేసుకుంటూ ఉండేవాడు. 2021, April నెలలో కడియం పి.ఎస్. పరిధిలో మొట్టమొదటగా దొంగతనం చేసినాడు. మోటార్ సైకిల్ ను False Key (దొంగతాళం ) ద్వారా తీయడం లేదా దాని హ్యాండిల్ లను బలంగా ముందుకు వెనుకకు కదలించడం ద్వారా దొంగలించడం మొదలుపెట్టాడు. దొంగిలించినమోటార్సైకిళ్ళను జగ్గంపేట మండలం గోవిందపురం విలేజ్ కు చెందిన మంగిన వీరబాబు కి తక్కువ ధరకు అమ్మేవాడు. తక్కువ రేట్ కు అనగా 5 వేల నుండి 10 వేల వరకు బేరం తెచ్చి ఈ మోటార్ సైకిల్స్ అమ్మడం జరిగింది. RC బుక్ విషయమై ఒరిజినల్ పట్టుకొచ్చి తరువాత ఇస్తాము ఇచ్చిన తర్వాత మిగతా డబ్బు పట్టుకుని వెళామని అందరినీ వీరు నమ్మబలికే వారు. ఆ విధంగా 15 వేల రూపాయలు లేదా 12 వేల రూపాయలకు బండి బేరమాడుకుని 7 వేల నుండి 10 వేల రూపాయల వరకు అడ్వాన్స్ గా తీసుకుని మిగిలిన డబ్బు రికార్డు ఇచ్చాకా పట్టుకుని వెళతామని చెప్పి పార్టీలను నమ్మించి అమ్మడం జరిగింది.