పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక - స్పందన కార్యక్రమం లో పాల్గొని ప్రజల నుండి 83 ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్. తమ కన్నబిడ్డలు తమ బాగోగులు పట్టించుకోకుండా వేధిస్తున్నారని వృద్దులు ఫిర్యాదు చేసారని, జన్మనిచ్చిన తల్లిదండ్రుల బాగోగులు చూడడం అనేది మనిషిగా,కొడుకుగా తప్పక నిర్వర్తించవలసిన భాద్యత కావున వారి బాగోగుల పట్టించుకొని వారి బిడ్డలకు తగిన కౌన్సెలింగ్ నిర్వహించాలని పోలీస్ అధికారులను అదేశించడం జరిగినది.ఆరుగాలం శ్రమించి పండించిన పంటను రైతుల నుండి కొనుగోలు చేసి, వారికి నగదు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను అదేశించారు.