ఢిల్లీలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు స్మృతి మందిర్ నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మంగళవారం పీవీఎన్ 101 జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్లో ఆయన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు ప్రజలంతా గర్వపడే వ్యక్తి పీవీ నరసింహారావు అన్నారు. ఢిల్లీలోని పీఎం మ్యూజియంలో పీవీఎన్ జ్ఞాపకాలను ఏర్పాటు చేశామన్నారు.